హైదరాబాద్: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతించింది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్యతో పాటు ముందుగా స్లాట్ బుక్ చేసుకునే విధానానికి కూడా హైకోర్టు సమ్మతి తెలియచేయడంతో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగబోమని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది.
ఇవాళ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పై ఇవాళ హైకోర్టు లో విచారణ జరిగింది. కంప్యూటర్ విధానంతో ఈ ప్రక్రియ కొనసాగాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజిస్ట్రేషన్లను ఆపాలని ఎప్పుడూ స్టే ఇవ్వలేదని, నిబంధనలపైనే కేసును విచారిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రోజు దాఖలైన ఐదు అనుబంధ పిటీషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ బీఎస్.ప్రసాద్ ను ఆదేశిస్తూ, కేసును 16వ తేదీకి వాయిదా వేసింది.