FbTelugu

లాక్ డౌన్… వీడియో తీయాలి: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పక్కాగా అమలవుతుందా లేదా అనేది పరిశీలించేందుకు వీడియో చిత్రీకరణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్నిపోలీసు స్టేషన్లలో లాక్ డౌన్ మినహాయింపు సమయంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా తెలుసుకునేందుకు వీడియో తీయాలని స్పష్టం చేసింది.

లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో కూడా వీడియో తీయాలని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశం ప్రకారం జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనేది వీడియో తీసి జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. మాస్క్ పెట్టుకోకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా, శానిటైజర్ వెంట లేకపోయినా జరిమానా విధించే ప్రమాదం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.