FbTelugu

హైకోర్టు ఆదేశం… ఏలూరు బాధితుల స్టేట్ మెంట్

ప.గో.జిల్లా: ఏలూరు నగరవాసులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తి భీమారావు భరోసా ఇచ్చారు.
ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇవాళ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వివరాలు ఆరా తీశారు.

తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్ మెంట్ ను భీమారావు నమోదు చేసుకున్నారు. మూర్చ సమస్యతో ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరినట్లు ఆయనకు వివరించారు. భార లోహం, సీసం కారకాలు ఉన్నట్లు ఏయిమ్స్ ప్రతినిధులు వెల్లడించారని ఆయన వివరించారు. ఏయిమ్స్ నుంచి పూర్తి వివరాలు అందిన తరువాత హైకోర్టుకు పూర్తి స్థాయి నివేదిక అందచేస్తానని భీమారావు మీడియాకు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.