FbTelugu

ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు

అమరావతి: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు రాసిన లేఖల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ ను విచారించిన హై కోర్టు విచారించింది.

గవర్నర్ తో తను జరిపిన ఉత్తరప్రత్యుత్తరాల లీకేజ్ పై సీబీఐ విచారణ కోరుతూ రమేష్ కుమార్ పిటీషన్ దాఖలు చేశారు. గవర్నర్ కార్యాలయం నుంచి ప్రివిలేజ్ లేఖలు లీకేజ్ అవలేదని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ తమకు తెలిపారని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. వాదనల తరువాత రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.