FbTelugu

మెట్రో టిక్కెట్లపై హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: రాయితీ ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో రైలు టిక్కెట్ల ధరలు ఖరారు చేశారని దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్ టీకి నోటీసులు జారీ చేసింది.

మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఒప్పందానికి వ్యతిరేకంగా మెట్రో రైలులో టిక్కెట్ల ధరలను ఖరారు చేశారని, ప్రయాణీకుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని పిటీషనర్ తెలిపారు.

పిటీషన్ పరిశీలించిన హైకోర్టు నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

You might also like