హైదరాబాద్: యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆస్పత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 14లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ కౌన్సిళ్ల ను హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, వైద్య ఛార్జీల్లో పారదర్శకత ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని న్యాయవాది శ్రీకిషన్ శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
న్యాయవాది శ్రీకిషన్ శర్మ పిల్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక బిల్లుల వసూలుపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా చికిత్సలకు ఎంత ఛార్జీ తీసుకోవాలో ప్రభుత్వం జీఓ ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. జీఓ ఉల్లంఘించిన ఆసుపత్రుల పై ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావిస్తున్నామన్నామని హైకోర్టు తెలిపింది.
ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. బిల్లు చెల్లించలేదని డీఎంఓను డిశ్చార్జ్ చేయని ఆస్పత్రిపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది.