FbTelugu

నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాది హత్య

పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు, ఆయన భార్య నాగమణి ని దారుణంగా హత్య చేశారు. రామగిరి మండలంలో దంపతులను కత్తులతో నరికి చంపారు.
ఇవాళ వామన్ రావు తన భార్యతో కలిసి మంథని నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

రమగిరి మండలం చేరుకోగానే క్రెటా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరి వాహనాన్ని అడ్డగించారు. రోడ్డు పైనే భార్యాభర్తపై కత్తులతో దాడికి చేసి పొడిచారు. ఆ తరువాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వామన్ రావు ను రోడ్డు మీదుగా వెళ్లేవారు ఆరా తీశారు. మీ పేరు ఏంటి, ఏ ఊరు మీది అని అడిగారు. దాడి చేసింది ఎవరని ప్రశ్నించగా… గుంజపడుగుకు చెందిన కుంట శ్రీను దాడి చేశాడని చెప్పాడు. వామన్ రావు కొంత కాలంగా పలు వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని ఘటనను బట్టి అర్థమవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.