FbTelugu

జగన్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

అమరావతి: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్ లో ధాఖలు చేసిన దానికి, క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కరోనా విధానాలకు పొంతనలేదని ధర్మాసనం మండిపడింది.

ఇవాళ హైకోర్టులో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ఆక్సిజన్ లభ్యత, మంచాలు, మందుల కొరతపై విచారణ జరిగింది. ఆసుపత్రులలో మంచాలు దొరకడం లేదని నోడల్ అధికారులే బదులివ్వడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.పద్ధతి మార్చుకోకుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్)  అఫిడవిట్ ధాఖలు చేయాల్సివస్తుందని హైకోర్టు హెచ్చరించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.