FbTelugu

జగన్ కేసుల ఉపసంహరణపై హైకోర్టు విచారణ

అమరావతి: సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న క్రిమినల్ కేసులను ఫిర్యాదుదారులు, పోలీసులు ఉపసంహరించడాన్ని ఏపి హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
మొత్తం 11 క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత నేడు విచారించనున్నది.

జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనపై పలు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను కొవిడ్‌ సమయంలో పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (పిపి), సంబంధిత న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా హడావుడిగా ఉపసంహరించారు. ఈ కేసుల వివరాలు హైకోర్టు దృష్టికి రావడంతో పరిపాలన విభాగం ఈ కేసులను పరిశీలించి సుమోటోగా విచారణకు తీసుకుని నంబర్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ఫిర్యాదుదారులు, వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఈ కేసులలో ప్రతివాదులుగా ఉన్నారు. ఉపసంహరించిన మొత్తం 11 కేసుల్లో అనంతపురం జిల్లాకు సంబంధించినవి 5, గుంటూరు జిల్లాకు సంబంధించినవి 6 కేసులు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.