FbTelugu

ఎంపి రాజు కేసు పై కాసేపట్లో హైకోర్టు విచారణ

గుంటూరు: వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు కాలికి తగిలిన గాయాలపై కొద్ది సేపట్లో ఏపి హైకోర్టు డివిజన్ బెంచి విచారించనున్నది. హైకోర్టు ఆదేశం ప్రకారం గుంటూరు జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) నివేదిక సిద్దం చేసింది.

అదే విధంగా సిఐడి ప్రత్యేక కోర్టు రికార్డు చేసిన ఎంపి రఘురామ కృష్ణమరాజు నివేదికను కూడా హైకోర్టుకు అందచేయాల్సి ఉన్నది. రెండు నివేదికలను సీల్డు కవర్ లో గుంటూరు జిల్లా సెషన్స్ జడ్జి ద్వరా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు ను వైద్య పరీక్షలు నిమిత్తం గుంటూరు గవర్నమెంటు హాస్పిటల్ నుంచి రమేశ్ హాస్పిటల్ కు ఇవాళ ఉదయం తరలించారు. ప్రస్తుతం జిజిహెచ్ లో రాజుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రఘురామ కృష్ణమరాజు గాయాలపై ఏపి హైకోర్టు మెడికల్ బోర్డు తన నివేదికను అందచేయనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.