FbTelugu

గ్యాస్ లీక్ ఘటనపై హైకోర్టులో విచారణ

అమరావతి: విశాఖలో ఎల్జీపాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. అయితే విచారణ సమయంలో కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు.

కాగా పాస్ పోర్టులను సరెండర్ చేశామని ఎల్జీపాలిమర్స్ తరపు న్యాయవాదులు తెలిపారు. అదేవిధంగా గ్యాస్ లీకైన ట్యాంక్ మినహా మిగతా ట్యాంకులను సౌత్ కొరియాకు పంపించినట్టు తెలిపారు. ఎన్జీటీ ఆదేశాలతో జిల్లా కోర్టులో రూ.50 కోట్లు డిపాజిట్ చేశామని ఎల్జీ పాలిమర్స్ పేర్కొంది. గ్యాస్ లీక్ ఘటనపై 9 సంస్థలు విచారణ జరుపుతాయని ప్రభుత్వం తెలిపగా.. ఏదో ఒక సంస్థతో విచారణ జరిపించాలని ఎల్జీపాలిమర్స్ కోరింది.

You might also like