FbTelugu

ప్రవేశ పరీక్షలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ కేబినెట్ నిర్ణయం పై ఆధారపడి ఉందని అడ్వకేట్ జనరల్ (ఏజీ) హైకోర్టుకు తెలిపారు.

ఇవాళ హైకోర్టులో రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలపై నమోదు అయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. లాక్ డౌన్ పై ఒకటి, రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం ఉంటుందని ఏజీ విన్నవించారు. ప్రవేశ పరీక్షల వాయిదాపై మధ్యాహ్నం 2.30 కి నిర్ణయం చెబుతామన్నరు. ఎంట్రన్స్ ల వాయిదా అవకాశాలపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చిస్తారని తెలిపారు. దీంతో విచారణ మధ్యాహ్నం 2.30కి వాయిదా పడింది.

లాక్ డౌన్ అమల్లో ఉంటే విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు ఎలా హాజరవుతారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. లాక్ డౌన్ నిబంధనలపై స్పష్టతనివ్వాలని హైకోర్టు ఏజీ ని ఆదేశించింది.

You might also like