FbTelugu

రంగుల జీఓ కొట్టేసిన హైకోర్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ కార్యాలయాలకు వేస్తున్న రంగులపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. కార్యాలయాలకు ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు అదనంగా మరో రంగు వేయాలని ఏపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ జీఓ ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది.

అయితే పంచాయతీ కార్యాలయాలకు వేస్తున్న రంగులు పార్టీ రంగులు కాదని ప్రభుత్వం తెలిపింది. పార్టీ రంగులపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదని దీనిపై కేసును సుమోటోగా తీసుకుంటున్నట్టు హైకోర్టు తెలిపింది. దీనిపై 28 లోగా వివరణ ఇవ్వాలని సీఎస్, పంచాయతీ శాఖ కార్యదర్శి, ఈసీలను ఆదేశించింది.

You might also like