FbTelugu

ఆర్టిపిసిఆర్ 70 శాతం పెంచాల్సిందే: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇకనుంచి ఆర్టిపిసిఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలని, ర్యాపిడ్ టెస్టులను తగ్గించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇవాళ హైకోర్టులో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై విచారణ జరగ్గా, కరోనా మార్గదర్శకాలపై డిజిపి నివేదిక సమర్పించారు. ఆర్టిపిసిఆర్ పరీక్షలు తక్కువ చేస్తున్నారని, పెంచాలని చెబుతున్నా ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 70 ఆర్టిపిసిఆర్, 30 శాతం ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. వైన్ షాపులు, బార్లు, పబ్బులు, కరోనా కేంద్రాలుగా మారాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఆర్టిపిసిఆర్ టెస్టు రిపోర్టు చూపిస్తేనే అనుమతించాలని లేదంటే వారికి కూడా ఇదే రకమైన పరీక్షలు చేయించాలని హైకోర్టు సూచించింది.

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీసుకుంటున్న చర్యలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 1.16 లక్షల మందికే జరిమానా విధించారా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్ పాతబస్తీలో రెండు రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది పట్టుబడతారని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీరో సర్వైలెన్స్ ఆరు వారాల్లో పూర్తి చేస్తామని, పరీక్షలు పూర్తయ్యాక నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.