FbTelugu

కరెంటు బిల్లులు కౌంటర్ వేయండి: హైకోర్టు

హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో కరెంటు బిల్లులు రద్దు చేయాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) హైకోర్టులో దాఖలైంది.

న్యాయవాదులు నరేష్, సమీర్ లు వేసిన పిటీషన్ పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ఆదేశించింది. దీంతో పాటు లాక్ డౌన్ సమయంలో బిల్లులు ఇష్టానుసారంగా వేశారని, స్లాబులు తగ్గించి భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని మరో పిటీషన్ దాఖలు అయింది. దీనిపై విచారించిన హైకోర్టు తాము జోక్యం చేసుకోలేమని, ఫిర్యాదు చేయాల్సిందిగా స్పష్టం చేసింది.

You might also like