FbTelugu

టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…

 

హైదరాబాద్: జూన్ 8వ తేదీ నుండి టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతించింది.

టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. టెన్త్ పరీక్షలు జరపడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది.

పరీక్షా కేంద్రాల వద్ద అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ బీఎస్.ప్రసాద్ కోర్టుకు తెలిపారు. జూన్ 3 న కరోనా పరిస్థితులను సమీక్షించి, జూన్ 4 న నివేదిక సమర్పించాలని హైకోర్టు అదేశాలిచ్చింది..

అదే విధంగా జూన్ 8 న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వాని కు సూచించిన హైకోర్టు, ప్రతి పరీక్ష కు రెండు రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేసింది. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

You might also like