FbTelugu

ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలపై ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కరోనా పరీక్షల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న తెలంగాన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

ఈ సందర్భంగా.. లక్షణాలు లేని హైరిస్క్ అవకాశాలున్న వారికి ఎందుకు పరీక్షలు చేయట్లేదని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ పరీక్షలెందుకని ప్రశ్నించింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు జరిపిన పరీక్షల వివరాలన్నింటిని సమర్పించాలని ఆదేశించింది. ఆస్పత్రిలో చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా కరోనా పరీక్షలపై కేంద్రం రాసిన లేఖలను సమర్పించాలని ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.