FbTelugu

గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్

అమరావతి: వివాదాస్పదంగా గ్రూప్-1 పరీక్షల వాల్యుయేషన్ జరగడంతో ఏపి హైకోర్టు రేపటి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను వాయిదా వేసింది. నాలుగు వారాల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించరాదని ఏ.పి.పి.ఎస్.సి ని స్పష్టం చేసింది.

షెడ్యూలు ప్రకారం గురువారం (రేపటి) నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. డిజిటల్‌ వాల్యూయేషన్‌ గురించి చివరి దశలో చెప్పారని, ప్రైవేటుకు చెందిన టిసిఎస్ సంస్థతో చేయించారని అన్నారు. ప్రభుత్వం తన వాదనలు విన్పించినప్పటికీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ఇంటర్వ్యూలపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.