FbTelugu

ఏపి ప్రభుత్వ చర్యపై హైకోర్టు బ్రేక్

అమరావతి: విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్ వేసింది. విశాఖలో ఐదు చోట్ల భూములు అమ్మడానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ ను ఇవాళ హైకోర్టు విచారించింది. గతంలో బిల్డ్ ఏపీ పేరున ఇలానే అమ్మకాలకు ప్రయత్నించగా కోర్టు స్టే ఇచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఇదే ఆదేశాలు విశాఖ భూముల అమ్మకానికి వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. టెండర్లు ఖరారు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.