FbTelugu

ఉద్ధవ్ సర్కార్ ను తప్పుపట్టిన హైకోర్టు

ముంబై: మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ముంబై హైకోర్టు తప్పుపట్టింది. బాలీవుడ్ నటీమణి, వివాదాస్పద నటి కంగనా రనౌత్ కు భారీ ఊరట లభించింది.

బాంద్రాలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని కొద్ది రోజుల క్రితం బ్రిహన్ ముంబై కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారు. దీనిపై కంగనా హైకోర్టును ఆశ్రయించగా, ఇవాళ తుదితీర్పునిచ్చింది. చట్ట ప్రకారం నిర్మించిన భవనన్ని చట్ట విరుద్దంగా కూల్చివేశారని బీఎంసీ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేసిన దాన్ని తిరిగి నిర్మించుకునేందుకు భవన యజమానికి డబ్బులు చెల్లించాలని ఆదేశించింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో కంగనా మహారాష్ట్ర సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ముంబై నగరాన్ని పీఓకే తో పోల్చుతూ విమర్శలు గుప్పించింది. ఈ వ్యాఖ్యలతో శివసేన, కంగనా మధ్య విమర్శల దాడి జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన సర్కార్ కంగనా కార్యాలయం అక్రమం అంటూ కూల్చివేతలు జరిపింది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.