FbTelugu

స్థానిక సంస్థల ఫలితాలపై హైకోర్టులో అప్పీల్

అమరావతి: రాష్ట్రంలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ చేసింది. కేసు నెంబర్ కేటాయింపు కోర్టు పరిశీలనలో ఉంది. పోలింగ్‌ ముగిసినందున కౌంటింగ్‌కు అనుమతించాలంటూ వినతి చేసింది.
తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి స్థానిక సంస్థల కోటాలో 11 ఖాళీలు ఏర్పడ్డాయి.

ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికల ప్రక్రియ పూర్తయితేనే వాటికి ఎన్నికలు జరిపే వీలుంటుందని హైకోర్టుకు తెలిపింది. శాసన మండలిలో అధికార వైసిపికి బలం మరింత పెరగకుండా అడ్డుపడేందుకే టిడిపి, జనసేన లాంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టిస్తున్నాయని ఆరోపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆటంకాలు కల్పిస్తున్నాయని ప్రభుత్వ వాదించనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.