FbTelugu

టిటిడి పిల్ పై హైకోర్టు ఆగ్రహం

అమరావతి: పోలీసు స్టేషన్ లో నమోదు అయిన ఒక కేసులో దర్యాప్తు సరిగా జరగకపోయినా, పురోగతి లేకపోయినా హైకోర్టును ఆశ్రయించవచ్చని, ఇలాంటి వ్యవహారాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ఎలా వేశారంటూ హైకోర్టు ప్రశ్నించింది.

టిటిడి పై 2019లో ఒక పత్రిక ప్రచురించిన కథనంపై కేసులో బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి, మరో పిటిషనర్ న్యాయవాది సత్య సబర్వాల్ను హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. బుధవారం నాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకె.గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. టిటిడి పై ఒక పత్రిక ప్రచురించిన కథనంపై టిటిడి విజిలెన్స్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్ లో 2019 డిసెంబర్ 14వ తేదీనన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తరువాత విచారణలో ఎలాంటి పురోగతి లేదనేది ఫిర్యాదుదారుల వాదన. దర్యాప్తు సాగడం లేదంటూ ఎంపి సుబ్రమణ్యస్వామి, న్యాయవాది సత్య సబర్వాల్ ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో పిల్ వేశారు. కోట్లాది మంది భక్తులు విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి పిల్ దాఖలు చేశామని న్యాయవాది సత్య సబర్వాల్ తెలపగా, హైకోర్టు ఆక్షేపించింది. సుబ్రమణ్యస్వామి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన వాదనలు వినిపిస్తారని చెప్పగా హైకోర్టు కేసును రెండువారాలకు వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.