FbTelugu

కెసిఆర్ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తీవ్రంగా  మండిపడింది.

సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని   హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు కూడా ఇవ్వలేదని ఆక్షేపించింది. ప్రజల ఆరోగ్యం అవసరం లేదా, పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా అని సూటిగా ప్రశ్నించింది. జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ చెప్పగా, ఏమాత్రం అంగీకరించలేదు.

ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు? అని హైకోర్టు నిలదీసింది. గత విచారణ సందర్భంగా మేము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా?  ఆదేశాలు ఇవ్వమంటారా? అని హైకోర్టు అడిగింది. ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నం 2 గంటలలోగా నివేదించాలని హైకోర్టు ఆదేశించింది.  భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామని తెలిపింది. మధ్యాహ్నం విచారణకు సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు  ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.