FbTelugu

ఉన్నత విద్యా కమిషన్‌ పై హైకోర్టు ఆగ్రహం

అమరావతి: ఫీజుల సిఫార్సు అంశంలో ఏపి ఉన్నత విద్యా కమిషన్ తీరును హైకోర్టు తప్పుబట్టింది. అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫీజుల అంశంలో చట్టపరమైన నిబంధనలు పాటించక పోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.

వ్యక్తిగతంగా కానీ, నేరుగా కానీ కళాశాలల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా సొంత రుసుములను కమిషన్ సిఫార్సు చేయడం చట్ట ఉల్లంఘనే అని పేర్కొంది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఫీజులు ఖరారు చేస్తూ జిఓ  నెంబర్ 1ని జనవరి 8న ప్రభుత్వం జారీ చేసింది. ముందస్తుగా కళాశాలకు సమాచారం ఇవ్వకపోవడంతో శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు జిల్లాల కళాశాలల యాజమాన్యాలు  హైకోర్టును ఆశ్రయించాయి. జిఓ నెం 1 ను కొట్టివేస్తూ కళాశాలలకు ముందస్తు సమాచారం ఇచ్చి వారితో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు తాత్కాలిక రుసుములే విద్యార్థుల నుండి వసూలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.