FbTelugu

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషనర్ గా పునర్నియాకంపై రాష్ట్ర గవర్నర్‍ను కలవాలంటూ నిమ్మగడ్డ రమేష్‍ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది.

మేం ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‍గా(ఎస్ఈసీ) నియమించే అధికారం గవర్నర్‍కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటీషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ తెలిపారు.

సుప్రీం కోర్టులో మూడుసార్లు విచారణ జరిగినా స్టే ఇవ్వలేదని హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. సుప్రీం స్టే ఇవ్వనందున హైకోర్టు తీర్పు అమలులోనే ఉన్నట్టే అని చెప్పింది. పునర్నియామకం పై గవర్నర్‍ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేయాలని నిమ్మగడ్డ రమేష్‍కు సూచించింది. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది.

You might also like