FbTelugu

స్వర్ణ ప్యాలెస్ యజమాని విచారణకు ఓకే

అమరావతి: బెజవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో విచరణకు హైకోర్టు అనుమతించింది. కోవిడ్ సెంటర్ యజమాని డాక్టర్ రమేష్ చౌదరిని న్యాయవాది సమక్షంలో నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు కస్టోడియల్ విచారణ చేయాలని ఆదేశించింది.

ప్రతి రోజు  ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు డాక్టర్ రమేష్ ను పోలీసులు విచారించనున్నారు. ఘటన జరగ్గానే యజమాని పారిపోయి, ఆ తరువాత హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లడంతో విచారణకు అనుమతించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.