FbTelugu

తెలంగాణ సర్కార్ పై హైకోర్టు మళ్లీ అసంతృప్తి

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ జరిగిన సందర్భంలో హైకోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు హాస్పిటళ్లలో దోపిడి చేస్తున్నారని, నియంత్రించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. గతేడాది దోపిడి నియంత్రణకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారని, ఇప్పుడా టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడుందని అడిగింది.

ప్రైవేటులో హెచ్ సిటీ స్కాన్, ఇతర పరీక్షలపై ధరలు ఖరారు చేయాలని సూచించారు. గతంలో ఇచ్చిన జిఓ సరిపోదని, మళ్లీ జిఓ జారీ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించగా, అడ్వకేట్ జనరల్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. అలాగే పడకలపై వెబ్ సైట్ లో ఒకరకంగా, హాస్పిటల్ కు ఫోన్ చేస్తే మరో రకంలా సమాధానం వస్తోందని హైకోర్టు మండిపడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.