FbTelugu

లక్ష్మణ్‌కు హైకమాండ్ పిలుపు.. ఢిల్లీకి పయనం

High-command-calls-for-Laxman-to-travel-to-Delhi

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి లక్ష్మణ్ నివేదిక సమర్పించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. కేంద్రం ఆర్టీసీ సమ్మెపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. ఎంపీ బండి సంజయ్‌ విషయంలో పోలీసుల చర్యలపట్ల ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా లక్ష్మణ్‌కు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మణ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేత ఆశ్వత్థామరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తదితరులు ఆయనను కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలిపారు.

You might also like