అమరావతి : ఏలూరు భూగర్భజలాల్లో క్లోరిన్ అధిక మోతాదులో ఉందని భూగర్భజల శాఖ తాజాగా వెల్లడించింది. ఏలూరులో వింత వ్యాధి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భూగర్భ జల శాఖ సాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో భూగర్భ జలాల్లో క్లోరిన్ అధికమోతాదులో ఉనట్టుగా వెల్లడైనట్టు తెలిపింది.
మున్సిపల్ ట్యాప్ వాటర్ సాంపిల్స్ సైతం సేకరించి పరీక్షలు జరిపింది. తాగు నీటిలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో క్లోరిన్ ఉన్నట్లుగా గుర్తించింది. బాధిత ప్రాంతాల్లో 12 చోట్ల సాంపిల్స్ సేకరించి ఈ ఫలితాలను ప్రకటించింది. ఇదిలావుంటే ట్యాంక్ వున్న ప్రాంతాల్లో మద్యం బాటిల్స్ గుర్తించారు. క్లోరిన్ కలిపే వ్యక్తులు మద్యం మత్తులో క్లోరిన్ అధికమోతాదులో కలిపి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.