FbTelugu

ఇంట్లో కూర్చున్నందుకే అధిక బిల్లులు: మంత్రి పేర్ని

మచిలీపట్నం: ఇంట్లో కూర్చుని విద్యుత్ అధికంగా వాడారు కాబట్టే బిల్లులు ఎక్కువ వచ్చాయని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

ప్రజల వినియోగం మేరకే విద్యుత్ బిల్లులు వచ్చాయని ఆయన అన్నారు. మచిలీపట్నం అశీర్వాదపురంలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. అధిక విద్యుత్ బిల్లులపై కూడా ప్రజలకు స్పష్టత ఇచ్చారు. హౌస్ టాక్స్, వాటర్ టాక్స్ చెల్లింపులు, అధికంగా వచ్చిన విద్యుత్ ఛార్జీలపై మంత్రి పేర్ని నాని ప్రజలకు స్పష్టతనిచ్చారు. సకాలంలో హౌస్ టాక్స్, వాటర్ టాక్స్ కట్టకుంటే వడ్డీ చెల్లించక తప్పదని మంత్రి అన్నారు. సకాలంలో పన్నులు చెల్లించకుంటే రూ.2లు వడ్డీ కట్టక తప్పదన్నారు.

You might also like