FbTelugu

వరంగల్ లో హై అలర్ట్

వరంగల్: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడం, మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి జిల్లా టేకుమటల మండలం కుందన్ పల్లి గ్రామ శివారులో చలివాగు పొంగిపొర్లి 10 మంది రైతులు చిక్కుకున్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో రహదారులను మూసివేయాలనే ఆలోచనలో ఉన్నారు.

మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలెవరూ బయటకు రావద్దని ప్రభుత్వ యంత్రాంగం పిలుపునిచ్చింది. చేపల కోసం మత్స్యకారులు కూడా చెరువులకు వెళ్లొద్దని సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

You might also like