FbTelugu

ఢిల్లీలో హై అలెర్ట్ 

ఢిల్లీ: ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

నలుగురైదుగురు ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ నుంచి ట్రక్ లో ఢిల్లీ చేరుకున్నట్లు నిఘావర్గాలకు స్పష్టమైన సమాచారం అందింది. మరికొందరు ఢిల్లీకి రావడానికి  రోడ్డు మార్గంలో బస్సు, కారు లేదా ప్రైవేట్ వాహనాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం వచ్చింది.

నిఘా వర్గాల సమాచారం మేరకు అనుమానాస్పదంగా సంచరించేవారిని, వాహనాలను జల్లెడ పడుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వాహనాలు సీజ్ చేస్తున్నారు. వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

You might also like