FbTelugu

హిడ్మా, శారదలు చనిపోలేదు: మావోయిస్టుల లేఖ

ఖమ్మం: మావోయిస్టు పార్టీ నేతలు కామ్రేడ్ హిడ్మా, కామ్రేడ్ శారద లు కరోనా పాజిటివ్ తో చనిపోయారని జరుగుతున్న ప్రచారం అబద్దమని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఖండించారు.
తెలంగాణ పోలీసులు, పాలకులు చేస్తున్న దుష్ప్రచారం తప్పితే ఎవరూ ఈ వార్తను నమ్మవద్దని జగన్ సోమవారం నాడు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

హిడ్మా, శారద లు ఆరోగ్యంగానే ఉన్నారని. ఇదంతా పోలీసులు కుట్ర అన్నారు. మేము కరోనా వైరస్ కు అతీతులం కాదు, ఈ వైరస్ సోకి కామ్రేడ్ హరిభూషన్, కామ్రేడ్ భరతక్కలు ప్రజలకు దూరమయ్యారు. ప్రకృతి వనరులను దోచుకోవడానికి విధ్వంసానికి సామ్రాజ్యవాదులు దిగడం మూలంగానే ఈరోజు ప్రజలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్నది. ఉద్యోగాలు లేక, జీతాలు రాక, వైద్యం చేయించుకోలేక కోట్లాది మంది చనిపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని ధ్వజమెత్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.