FbTelugu

హైటెక్ లేడీ వల… రూ.1.29 కోట్లు లూటీ

రాజ్ కోట్: అందమైన హైటెటక్ లేడీతో డేటింగ్ కావాలా! మమ్మల్ని సంప్రదించాలంటూ ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. ఇంకేముంది వెనకా ముందూ ఆలోచించకుండా ఒక వ్యక్తి ఆ నెంబర్ ఒకే అంటూ మెస్సేజి ఇచ్చాడు. ఆ మెస్సేజ్ మాయలో పడి తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1.29 కోట్లు పోగొట్టుకున్నాడు.

రాజ్ కోట్ జిల్లా గోండల్ పట్టణానికి చెందిన అశ్విన్ విసారియాకు వ్యవసాయ భూమితో పాటు ఎర్త్ మువింగ్ మిషన్ల వ్యాపారం ఉంది. ఆయనకు ఒకరోజు అందమైన అమ్మాయిలు కావాలంటే ఫోన్ చేయండంటూ ఎస్ఎంఎస్ వచ్చింది. దాని ప్రకారం ఫోన్ చేయగా, అవతలి వ్యక్తి మెంబర్ షిప్ ఫీజు గా రూ.2,500 చెల్లించాలని చెప్పగా పంపించాడు. కొద్ది రోజుల తరువాత విఐపి మెంబర్ షిప్ తీసుకున్నాడు. అమ్మాయి నెంబర్ ఇవ్వకపోగా, డబ్బులు చెల్లించలేదు. మరో కొత్త స్కీమ్ చెప్పగా, దానికి అశ్విన్ ఓకే చెప్పాడు. పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుందంటూ నమ్మించగా, వారి మాటలకు మోసపోయి రూ.1.29 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గమనించిన ఆయన పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫోన్ నెంబర్లు, ఎస్ఎంఎస్ ఆధారంగా మోసం, కుట్ర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.