FbTelugu

ఏమండోయ్‌.. ఇది విన్నారా..?

అనేక కేసుల్లో ముద్దాయిలను పోలీసులు చార్జీషీటు వేయకుండా రోజుల కొద్ది పోలీస్‌స్టేషన్లలోనే ఉంచుతున్నారన్న వార్తలను చాలాసార్లు విన్నాం. అనేకమందిని చూశాం.

తిప్పితిప్పి కోర్టుకు తీసుకెళితే వారికి బెయిల్‌ రావడం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసింది. గడువులోగా పోలీసులు చార్జీషీటు వేయకుంటే నిందితుడికి కచ్చితంగా బెయిల్‌ ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి.

కనీసం లక్షణాలు కూడా కనిపించడం లేదు. దీంతో ఎవరికి ఈ మహ్మరి అంటుకుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి కరోనా నియంత్రించేందుకు కోర్టు ఇలా నిర్ణయం తీసుకుందట. కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను అత్యయిక పరిస్థితితో పోల్చలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏదైనా కేసులో దర్యాప్తు అధికారులు నిర్దిష్ట గడువులోగా చార్జిషీటు దాఖలు చేయకుంటే నిందితుడికి కచ్చితంగా బెయిల్‌ ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈ హక్కును ఎవరూ అడ్డుకోలేరని అభిప్రాయపడింది. ఒక కేసులో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

You might also like