FbTelugu

పాత బర్త్ డే చేసుకుంటానంటున్న హీరోయిన్

ముంబయి: జాన్వీ కపూర్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె. మరో మూడు రోజుల్లో 24వ సంవత్సరంలోకి అడుగుపెడతారు. బర్త్ డే వేడుకల కోసం అప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గుడ్ లక్ జెర్రీ షూటింగ్ బిజీలో ఉన్నందున, షూటింగ్ స్పాట్ లోనే ఘనంగా వేడుకలు చేసుకుంటానని చెబుతోంది అమ్మడు. మా డాడీ బోనీకపూర్ కూడా షూటింగ్ జరిగే ప్రాంతానికి వస్తున్నారు. గతేడాది జన్మదినం ఎలా చేసుకున్నారని అడగ్గా, 2020ని తన జీవితంలోకి తీసేశానని చెప్పింది. కరోనా వైరస్ మనల్ని ఏ వేడుకలను చేసుకోనివ్వలేదని, ఏడాది అంతా వేస్ట్ అయిపోందని పేర్కొంది. అందుకే 24వ సంవత్సరంలోకి ఈ ఏడాది అడుగుపెడుతున్నా 23వ బర్త్ డే చేసుకుంటున్నానని చెప్పింది. లాక్ డౌన్ కారణంగా ఆరేడు నెలలు ఇంటిపట్టునే ఉన్నాను, టైమంతా వేస్ట్ అయందని ఆవేదన వ్యక్తం చేసింది. ఐదు నెలల నుంచి షూటింగ్ లో ఉన్నానని, ఈ నెల 11 రూహీ చిత్రం విడుదల అవుతోందని జాన్వీ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.