FbTelugu

లిప్ లాక్ కు బై బై చెప్పిన హీరోయిన్

కరోనా వైరస్ ఒక్క రంగాన్నే కాదు అన్ని రంగాల్లో భౌతిక దూరం పాటించేలా చేస్తున్న విషయం తెలిసిందే. కలసి కూర్చోలేని, దగ్గరగా మాట్లాడలేని దుస్థితికి తీసుకువచ్చింది.
దీని ప్రభావం ప్రధానంగా సినిమా రంగంలో ఎక్కువగా ఉంది. చిత్ర పరిశ్రమ ఎంతో నష్టపోయింది. మూడు నెలలుగా చిత్ర పరిశ్రమ మూత పడింది. ఈ తరుణంలో కొందరు హీరోయిన్లు లిప్ లాక్ కు బైబై చెబుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న వేళ, తాను ఇకపై ముద్దులు, కౌగిలింతలు, శృంగార సన్నివేశాల్లో నటించబోనని హీరోయిన్ రెజీనా కసాండ్రా స్పష్టం చేసింది.

లిప్ లాక్ సన్నివేశాలు, కౌగిలింతలు, బెడ్ రూమ్ సీన్స్ లేకుంటేనే అంగీకరిస్తానని, అటువంటి సీన్స్ లో చేయాలంటే భయంగా ఉండటమే ఇందుకు కారణమని ఆమె మీడియాతో చెప్పింది. భవిష్యత్తులో అన్ని పరిస్థితులూ మారి, పాత రోజులు వస్తే చూద్దామన్నారు.

You might also like