FbTelugu

యశ్ వీరాభిమాని ఆత్మహత్య… సిద్ధూ హాజరు

బెంగళూరు: తన అంతిమ యాత్రలో హీరో యశ్, కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య పాల్గొనాలని ఆత్మహత్య లేఖ రాసిన వీరాభిమాని రామకృష్ణ ఉరేసుకుని చనిపోయాడు. అయితే వీరాభిమాని కోరిక ప్రకారం సిద్ధరామయ్య అతని అంత్యక్రియలకు హాజరు కాగా యశ్ రాలేదు.

మాండ్యా జిల్లాలోని కోడిదొడ్డి గ్రామంలో రామకృష్ణ (25) అనే యువకుడు ఉంటున్నాడు. కేజీఎఫ్ హీరోతో యశ్ తో పాటు కర్ణాటక సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్యకు వీరాభిమాని తన ఆత్మహత్యకు ముందు లేఖలో రెండు కోరికలు కోరాడు. తన పార్దీవ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో ఇద్దరు హాజరు కావాలని కోరాడు. తను జీవితంలో విఫలమైనట్లు పేర్కొన్న ఆయన తల్లికి మంచి కుమారుడిగా ఉండలేకపోయాను. అన్నకు మంచి తమ్ముడిగా ఉండలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఖరికి ప్రియురాలి మనసు కూడా గెలవలేకపోయానని.. ఇక తను జీవితంలో సాధించేది ఏమీ లేదంటూ పేర్కొన్నాడు. ఇక బతకడం కన్నా చావడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు ముగించాడు. రామకృష్ణ చివరి కోరిక ప్రకారం సిద్ధరామయ్య గ్రామానికి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనగా, యశ్ మాత్రం రాకుండానే ట్వీట్ చేసి సంతాపం ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.