FbTelugu

సూర్య నిర్ణయంతో సినీ పరిశ్రమ కంగు

చెన్నై: నటుడు సూర్య సినీ పరిశ్రమ కంగుతినేలా డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఎవరేమి అనుకున్నా పర్వాలేదు నేను మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో నా దారిలో నేను వెళ్తానని అంటున్నాడు.

ఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విడుదల చేయనున్నట్లు సూర్య ప్రకటించాడు. మహిళా దర్శకురాలు సుధా కాంగ్ర తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నదని చిత్ర పరిశ్రమ కోడై కూస్తున్నది. ఆ పుకార్లను నిజం చేస్తూ సూర్య ఒక ప్రకటన చేశారు. ప్రపంచ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఆకాశమే నీ హద్దురా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. వచ్చే అక్టోబర్ 30 ఈ చిత్రం విడుదల చేయనున్నారు.

You might also like