FbTelugu

ఆర్థిక మంత్రి నిర్మలపై హీరో సిద్ధార్థ్ ఘాటు విమర్శలు

చెన్నై: పెట్రోల్, డీజిల్ ధరలు జనానికి మంట పుట్టిస్తున్నాయి. కొందరు సెలెబ్రిటీలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల పై ఘాటుగా ట్వీట్ చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలపై అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తరువాత మరో రకంగా వ్యాఖ్యానించిన నిర్మల వీడియోను సిద్ధార్థ్ ట్విటర్ లో పోస్టు చేశారు. మామి తరువాతి స్థాయి చేరుకున్నారు కాని ఉల్లిగడ్డలు లేవు, మెమరో లేదు, మామి మీరు రాక్స్ అంటూ ట్వీట్ చేశారు. ఇంధన ధరల పెరుగుదలపై 2013లో నిర్మల మాట్లాడుతూ సామాన్యులపై భారం మోపుతున్నారంటూ అప్పటి కాంగ్రెస్ ను నిందించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది.
ఆర్థిక మంత్రిగా నిర్మల తాజాగా చేసిన వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నాయి. ధరల పెంపునకు ప్రభుత్వానికి ఎలంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో ఉండదని ఆమె చెప్పారు. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.