FbTelugu

మళ్లీ ఆ ఇద్దరు కలిశారు… శుభం!

మిత్రులుగా ఉన్నవారు ఎప్పుడు విడిపోతారో, మళ్లీ ఎలా కలుస్తారో ఎవరికీ తెలియదు. కాలం అందరినీ దగ్గరకు తీస్తుంది, విడదీస్తుంది కూడా. హీరో పవన్ కళ్యాణ్, కమేడియన్ అలీ మళ్లీ దగ్గరయ్యారు.
ఇద్దరూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మాట్లాడుకోవడంతో అభిమానులు మహానందపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో కమేడియన్ అలీ ఉండేవాడు. ఆంధ్రాలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు పొడచూపాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లో ప్రవేశించారు. అలీ అటు పవన్ తో ఇటు వైసీపీ అధినేత జగన్ తో కలిసి చివరకు జగన్ కు మద్దతు పలికారు. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి.

సన్నిహితంగా ఉండే ఇద్దరు విడిపోవడంతో టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. రెండు సంవత్సరాల తరువాత ఇద్దరు ఒక వేడుకలో ఒక్కటయ్యారు. అలీ బంధువుల వివాహం వీరిద్దరికి వేదిక అయ్యింది. బంధువుల వివాహానికి రావాల్సిందిగా అలీ కోరడంతో పవన్ ఈ నెల 18న వేడుకకు హాజరయ్యారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అలీ భార్య జుబేదా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలీ బంధువులు, కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ తో సెల్ఫీలు తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.