FbTelugu

ఓ ఇంటివాడైన హీరో నిఖిల్

హైదరాబాద్: టాలీవుడ్ సినీ హీరో నిఖిల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడైనాడు. ఇవాళ ఉదయం నిఖిల్ డా.పల్లవిని వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ నగర శివార్లలోని షామిర్‌పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో ఉదయం 6:30 గంటలకు పల్లవితో నిఖిల్ వివాహం జరిగింది.

నిజానికి ఈ వివాహం గత నెల 16 నే జరగాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నారు. అయితే ఇవాళ (మే14న) వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ రోజు దాటిటే ముహూర్తాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

You might also like