FbTelugu

కేసీఆర్ తో చిరు, నాగార్జున భేటీ

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో నటులు చిరంజీవి, నాగార్జున ఇవ్వాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో వరద బాధితుల కోసం రూ. 1 కోటి చెక్‌ను చిరంజీవి, రూ.50 లక్షలు నాగార్జున స్వయంగా కేసీఆర్‌కు ఇచ్చారు.

వరద బాధితులను ఆదుకోవాలని సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వరద బాధితుల సహాయం కోసం తారాలోకం కదలివచ్చిన విషయం తెలిసిందే. మొదటగా నాగార్జున రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత కొణిదెల  పవన్‌కల్యాణ్ వర బాధితుల కోసం రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్ తదితరులు విరాళాలు అందచేశారు.

2వేల ఎకరాల్లో సినిమా సిటీ…

హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెల్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమయినందున సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారంభించవచ్చని సిఎం ప్రకటించారు.

సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్ లో సిఎం ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి- విస్తరణపై చర్చ జరిగింది.

tollywood

You might also like

Leave A Reply

Your email address will not be published.