FbTelugu

ఆసుపత్రిలో చేరిన హీరో అక్షయ్

ముంబయి: మహానగరంలో ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నా తగ్గకపోవడంతో ఆసుపత్రులలో చేరక తప్పడం లేదు. గత వారం సచిన్ టెండూల్కర్ కూడా ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు.
తాజాగా హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు.

ఆయన రామసేతు మువీలో నటిస్తున్నారు. తన యూనిట్ లోని 45 మంది జూనియర్ ఆర్టిస్టులకు కూడా కరోనా నిర్థారణ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన అమిర్ ఖాన్, అలియా భట్, ఫాతిమా సనా షఏక్, పరేశ్ రావల్, మిలింద్ సోమన్ లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానంటూ అక్షయ్ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.