FbTelugu

అభిమాని ఫోన్ లాక్కున్న హీరో అజిత్

చెన్నై: తన భార్యతో కలిసి హీరో అజిత్ ఓటు వేసేందుకు తిరువాన్మయూర్ పోలింగ్ స్టేషన్ కు వచ్చాడు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తరువాత ఇద్దరూ బయటకు వచ్చారు. తమ అభిమాన హీరో వచ్చాడనే ఆనందంతో పలువురు సెల్ఫీ తీసుకునేందుకు పోటీపడ్డారు.

ఈ ఘటనను సహించలేకపోయిన అజిత్ ఒక అభిమాని సెల్ ఫోన్ లాక్కుని తన జేబులో పెట్టుకున్నారు. ఆ తరువాత అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అభిమానులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ వైఖరిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, ఈ లోగా అక్కడే ఉన్న పోలీసులు వచ్చారు. జన సమూహం నుంచి అజిత్, ఆయన భార్యను అక్కడి నుంచి బయటకు పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.