FbTelugu

హేమంత్… జగన్… మధ్యలో మోదీ!

మోదీకి మద్దతుగా జగన్ కౌంటర్

అమరావతి: కరోనా సెకండ్ వేవ్ యుద్ధంలో ప్రధాని నరేంద్ర మోదీపై వేలెత్తి చూపే సమయం కాదని ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ కు కౌంటర్ ఇచ్చారు.

జగన్, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌పై స్పందించారు. ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని మోదీ వినడం లేదని హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌ చేశారు. ఆయన చెప్పిందే విన్నామని, మేము చెప్పే అవకాశం లేకుండా చేశారన్నారు. హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌పై జగన్‌ రీట్వీట్‌ చేశారు. కరోనా పై యుద్ధంలో ప్రధానికి జగన్‌ సంఘీభావం తెలుపుతూ ట్వీట్‌ చేశారు. మహమ్మారిపై యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదని సోరెన్‌ ట్వీట్‌కు గట్టిగా ప్రతిస్పందించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దని జగన్ పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.