FbTelugu

హెల్మెట్ మింగేసిన గజరాజు

గౌహతి: ఇప్పటి వరకు ఏనుగులు పంటపొలాలపై దాడి చేయడం, మావటిలను చంపడం చూశాం కాని హెల్మెట్ లను గుటుక్కున మింగడం మాత్రం చూడలేదు. ద్విచక్ర వాహనానికి తగిలించిన హెల్మెట్‌ను ఓ ఏనుగు మింగేసింది.
గౌహతి లోని సత్‌గావ్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు అక్కడే రోడ్డుపై నిలిపిన బైక్‌కు దగ్గరికి వచ్చి ఆగింది.

బైక్‌ అద్దానికి తగిలించిన హెల్మెట్‌ను తొండంతో తీసుకుంది. ఆ తర్వాత రెండు అడుగులు వేసిన ఆ హెల్మెట్‌ను గటుక్కున మింగేసి ముందుకు వెళ్లింది. ఇదంతా సమీపంలో ఉండి గమనిస్తున్న కొంత మంది అధికారులు… హెల్మెట్‌ను తొక్కి పడేస్తుందని భావించారు. అందుకు భిన్నంగా మింగేయడంతో కంగుతిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.