FbTelugu

బిజెపి పాలనలో కరోనా రోగులకు నరకం: అఖిలేష్

లక్నో: కరోనా కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది అక్రమార్కులు ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, వెంటిలేటర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

రోగులకు కనీసం బెడ్లు కూడా దొరకడం లేదని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడానికి బిజెపి కారణమని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రస్తుత కల్లోలాన్ని బిజెపి అవకాశంగా మార్చుకున్నదని, అన్నీ బ్లాక్ మార్కెట్ లోనే దొరుకుతున్నాయన్నారు. లక్నోలోని కోవిడ్ కంట్రోల్ రూమ్ అధికారులు ప్రజలను పట్టించుకోవడం లేదని, ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదన్నారు. అలాంటి వారిపై సిఎం యోగి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు పడకేశాయని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటాని యోగి ప్రతినిత్యం చెబుతారని, ఆచరణలో మాత్రం చేయరని అఖిలేష్ ఎద్దేవా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.