FbTelugu

 నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్: నేడు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో 5.8 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా గుర్తించారు. తెలంగాణ మీదుగా విదర్భ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్టుగా తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

You might also like