FbTelugu

తెలంగాణలో నేడు భారీ వర్షాలు!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి కరైకల్ లోకి రుతుపవనాలు ప్రవేశించాయి.

జూన్ రెండో వారంలో తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో పక్క అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుఫాన్ కూడా గుజరాత్ మహారాష్ట్రల వైపుగా దూసుకొస్తోంది. అయితే ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.